KGF Chapter 2 Teaser On January 8th At 10:18 AM On Hombale Films Youtube Channels

KGF Chapter 2 Teaser On January 8th At 10:18 AM On Hombale Films Youtube Channels (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)

రాక్‌స్టార్ య‌శ్‌, ప్ర‌శాంత్ నీల్ కాంబినేష‌న్‌లో హోంబ‌లే ఫిలింస్ నిర్మిస్తోన్న భారీ ప్యాన్ ఇండియా మూవీ ‘కేజీయ‌ఫ్ చాప్ట‌ర్ 2’ షూటింగ్ పూర్తి.. జ‌న‌వ‌రి 8న టీజ‌ర్ విడుద‌ల

ఎంటైర్ ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీ ఆస‌క్తిగా ఎదురుచూస్తోన్న ప్యాన్ ఇండియా మూవీస్‌లో ‘కేజీయ‌ఫ్ చాప్ట‌ర్ 2’ ఒక‌టి. క‌న్న‌డ రాక్‌స్టార్ యశ్ హీరోగా సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా రూపొందుతోంది. భారీ చిత్రాల‌కు కేరాఫ్‌గా నిలుస్తూ మ‌న సౌత్ సినిమాను ప్యాన్ ఇండియా రేంజ్‌కు తీసుకెళ్ల‌డ‌మే ధ్యేయంగా భారీ బ‌డ్జెట్‌, హై టెక్నిక‌ల్ వేల్యూస్‌తో సినిమాల‌ను నిర్మిస్తోన్న హోంబ‌లే ఫిలింస్ బ్యాన‌ర్‌పై విజ‌య్ కిర‌గందూర్ ఈ చిత్రాన్ని అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మిస్తున్నారు. హీరో యష్‌ పుట్టినరోజు సందర్భంగా ‘కేజీయ‌ఫ్ చాప్ట‌ర్ 2’ టీజ‌ర్‌ను 2021, జ‌న‌వ‌రి 8 ఉదయం 10 గంటల 18 నిమిషాలకు విడుద‌ల చేస్తున్న‌ట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్ర‌క‌టించింది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ వారాహి చ‌ల‌న చిత్రం తెలుగులో ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తుంది.
ప్యాన్ ఇండియా మూవీగా ‘కేజీయ‌ఫ్ చాప్ట‌ర్ 1’ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌తో క‌లెక్ష‌న్స్ దుమ్ము రేపింది. దీనికి కొన‌సాగింపుగా రూపొందుతోన్న ‘కేజీయ‌ఫ్ చాప్ట‌ర్ 2’పై భారీ అంచ‌నాలున్నాయి. ఈ అంచ‌నాల‌ను మించేలా హీరో య‌ష్‌, ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్‌, హోంబ‌లే ఫిలింస్ అధినేత విజ‌య్ కిరగందూర్ ఈ సినిమాను ఆవిష్క‌రిస్తున్నారు. సినిమా షూటింగ్ పూర్తయ్యింది. వచ్చే ఏడాది ఈ సినిమాను గ్రాండ్ లెవ‌ల్లో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రావ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

రాఖీభాయ్‌గా య‌ష్ పాత్ర ఎంత ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉంటుందో దాన్ని ఢీ కొట్టేలా అధీర పాత్ర ఉంటుంది. ఈ పాత్ర‌ను బాలీవుడ్ సంజ‌య్ ద‌త్ పోషించారు. మ‌రో కీల‌క పాత్ర‌లో మ‌రో ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టి ర‌వీనాటాండ‌న్ క‌నిపించ‌నున్నారు. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో ఇంకా ప్ర‌కాశ్ రాజ్‌, అనంత్ నాగ్‌, రావు ర‌మేశ్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. భువ‌న్ గౌడ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి ర‌వి బ‌స్రూర్ సంగీత సార‌థ్యం వ‌హిస్తున్నారు.

 

KGF Chapter 2 Teaser On January 8th At 10:18 AM On Hombale Films Youtube Channels (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)
Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share